సుస్మిత హీరోయిన్ గా రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది తెలుసా ??

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు.

ఆయనని ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు.

మెగా ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే కేవలం మెగా ఫ్యామిలీలో అబ్బాయిలు మాత్రమే స్టార్ హీరోలుగా  సినిమాల్లో రాణిస్తున్నారు.

మెగా ఫ్యామిలీ లో ఉన్న అమ్మాయిలు మాత్రం సినిమాల్లో కనిపించలేదు.

నిహారిక కి హీరోయిన్ గా అవకాశం వచ్చినా సక్సెస్ ని అందుకోలేకపోయింది చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ని మొదట ఇండస్ట్రీ లోకి తీసుకురావాలని అనుకున్నారు.

హీరోయిన్ గా చూడాలనుకున్నారు చిరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ పక్కన సుస్మిత తో ఒక సినిమా రావాల్సి ఉండేది.

 కానీ అంతా సెట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ బాగోలేదని ఆ సినిమా షూటింగ్ ఆపేశారు.

ఇది మాత్రమే కాదు చాలా సార్లు చిరంజీవి తన కూతురు సుస్మిత ని హీరోయిన్ గా చేయాలని అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా అవ్వలేదు.

ఏదో ఒక అడ్డం వచ్చి ఆగిపోతూ ఉండేది. ఇలా ఆఖరికి చిరంజీవి తన కూతురిని హీరోయిన్ గా చేయాలనే ఆలోచనని మానుకున్నారు.

ఇప్పుడు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తోంది బ్యానర్ ని కూడా ఆమె స్థాపించింది.