ఫోక్ సాంగ్‌తో పాపులర్.. కట్ చేస్తే హీరోయిన్‌‌గా ఛాన్స్..! ఈ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.. 

Rajeev 

25 June 2025

Credit: Instagram

సోషల్ మీడియా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచంలోని చాలా మంది నెట్టింట తమ టాలెంట్ నిరూపించుకున్నారు.

టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ అప్పట్లో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఇన్ స్టాలో రీల్స్.. యూట్యూబ్ లో వీడియోస్ చేసి.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు

అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు. మొదట్లో నెట్టింట రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఫాలోయింగ్ పెంచుకుంది.

ఆ తర్వాత కవర్ సాంగ్స్ చేసింది. కానీ ఒకే ఒక్క ఫోక్ సాంగ్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. సార్య లక్ష్మణ్.

నచ్చినావురో అనే ఫోక్ సాంగ్ తో యూట్యూబ్ లో సెన్సెషన్ అయ్యింది సార్య. ఈ పాట సూపర్ హిట్ కావడంతో నెట్టింట ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

దీంతో ఆమెకు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మేము ఫేమస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది

కానీ ఆ సినిమా తర్వాత మరో మూవీ అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.