15ఏళ్లకే హీరోయిన్.. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్.. రూ. 120కోట్లకు యువరాణి 

Rajeev 

27 June 2025

Credit: Instagram

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. 

కానీ ఈ అమ్మడు మాత్రం అందరికన్నా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారిపోయింది. 

కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అంతే కాదు తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది

కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఆ అమ్మడు. ఆహా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కలలు కనేలా చేసింది 

ఇంతకూ ఆమె మరెవరో కాదు హన్సిక మోత్వానీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది.

కాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది హన్సిక. ఇటీవలే పెళ్లి చేసుకుంది. హన్సిక ఆస్తులు దాదాపు రూ. 120కోట్లకు పైనే అని తెలుస్తుంది.