పీటల దాకా వచ్చిన పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు ఇలా
12 August 2025
Rajeev
ఇండస్ట్రీలోకి చాలా మంది ఎన్నో కలలతో అడుగుపెడతారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. ఇక కొంతమంది సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ షిప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడిపోవడాలు మనం తరచు చూస్తే ఉన్నాం.
చాలా మంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే కొంతమంది మాత్రం బ్రేకప్ లు, విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఆ బ్యూటీ. ఆమె మరెవరో కాదు.. క్యూట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా.
కృష్ణగాడి వీర ప్రేమగాద తర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది.
కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది.
ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెల్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడుపుతుంది మెహరీన్.