లెజెండ్ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ??

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు.

ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు బాలయ్య.

అదేవిధంగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే.. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న బ్లాక్ బ్లస్టర్ మూవీ లెజెండ్ ఒకటి.

ఈ మూవీలోరాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు.

అదేవిధంగా ప్రతినాయకుడిగా జితేంద్ర పాత్రలో జగపతిబాబు నటన అదరగొట్టాడనే చెప్పాలి. ఈ మూవీతో జగపతి బాబు జాతకమే మారిపోయింది.

తొలుత సీనియర్ స్టార్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ని సంప్రదించారట.

కానీ విలన్ పాత్రలు తాను చేయడం ఇష్టం లేని రాజశేఖర్ ని సున్నితంగా లెజెండ్ మూవీని రిజెక్ట్ చేశాడట.