సాయిపల్లవికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా?

TV9 Telugu

17 March 2024

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి అనే పేరు విన్నవారందరూ అప్పట్లో చాలా కొత్తగా ఉందని అనుకునేవారట.

దాదాపు 14 ఏళ్లు వచ్చేవరకు స్టార్ కథానాయకి సాయి పల్లవికి కూడా తన పేరు గురించి పెద్దగా పట్టింపులేదని ఓ సరి చెప్పారు.

అయితే, ఆ తర్వాత కొన్నాళ్ళకు మాత్రం... నా పేరు చాలా డిఫరెంట్‌గా ఉంది కదా అని అనుకోసాగారట ఈ తరం మహానటి.

ఇన్‌ఫ్యాక్ట్, అలాంటి పేరు అస్సలు ఎవరికీ లేదని గర్వంగా కూడా అనిపించేదట ఈ సౌత్ ఇండస్ట్రీ ముద్దుగుమ్మకి.

సాయిపల్లవికి ఆ పేరు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో కొలువై ఉన్న శ్రీ సత్య సాయిబాబా పెట్టారట.

సాయిపల్లవి తల్లి, ఆంటీకే కాదు... కుటుంబసభ్యులు అందరికీ పుట్టపర్తి క్షత్రం చాల సుపరిచితమే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అక్కడే చదువుకున్నారట వారు. పుట్టపర్తి సాయిబాబా భక్తులు కూడా అట. అందుకే సాయిపల్లవి పుట్టిన నెల రోజుల్లోపే పుట్టపర్తికి తీసుకెళ్లారట.

అక్కడ సాయిబాబా పాపకు పాలు తాగించి, సాయిపల్లవి అని పేరు పెట్టారట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో సాయిపల్లవి పంచుకున్నారు.