కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా. 

22 August 2025

Rajeev 

చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు.

కానీ కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా స్టార్ డమ్ దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు

తన అందంతో కుర్రాళ్లను మాయలో పడేసింది ఈ చిన్నది. అలాగే నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.

కెరీర్ లో ఒకే ఒక్క భారీ హిట్ అందుకుంది ఆ బ్యూటీ. కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ కు గురయ్యింది. అదృష్టం కొద్దీ  ప్రాణాలతో బయటపడింది

ఆమె ఎవరంటే అందాల నభా నటేష్.  నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది.

ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అందుకుంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్న సమయంలో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది

కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా మారింది. మొన్నామధ్య డార్లింగ్ అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.