ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోస్ ఏంటో తెలుసా.?
Battula Prudvi
14 October 2024
'వార్నర్ బ్రోస్' ప్రపంచంలో టాప్ ఫిల్మ్ స్టూడియో కంపెనీ. 1923లో నలుగురు వార్నర్ సోదరులు కలిసి స్థాపించారు.
'వాల్ట్ డిస్నీ స్టూడియోస్' ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 1937లో స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ వీరి మొదటి చిత్రం.
ఇందులో '20త్ సెంచరీ స్టూడియోస్' మూడవ స్థానం దక్కించుకుంది. 1935లో ట్వంటీయత్ సెంచరీ పిక్చర్స్, ఫాక్స్ ఫిల్మ్ కార్పోరేషన్ ఒకటిగా విలీనంతో ఇది ఏర్పడింది.
1979లో స్థాపించబడిన 'పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్'ది ఇందులో నాలుగవ స్థానం. వీరి మొదటి ఫీచర్ ఫీల్మ్ టాయ్ స్టోరీ, 1995లో విడుదలైంది.
ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న 'యూనివర్సల్ పిక్చర్స్' 1912లో స్థాపించబడింది. ఇది అమెరికాలోని పూరితమైన స్టూడియో.
'మార్వెల్ స్టూడియోస్' 1993లో 'మార్వెల్ ఫిల్మ్స్' పేరుతో స్థాపించారు. 1996లో పేరు మార్చారు. ఇందులో ఆరవ స్థానంలో నిలిచింది.
1924లో స్థాపించబడిన MGM స్టూడియోస్ ప్రపంచంలో ఏడవ అతిపెద్ద సంస్థ. దీని పూర్తి పేరు మెట్రో గోల్డ్విన్ మేయర్ స్టూడియోస్.
1997లో అనేక చిన్న ఉత్పత్తి సౌకర్యాలు, పంపిణీదారులను కొనుగోలతో 'లయన్స్‌గేట్ స్టూడియో' ఏర్పడింది. ఇది ఎనిమిదవ అది పెద్ద సంస్థ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి