12 December 2023

కండక్టర్ కంటే ముందు రజినీకాంత్ ఏం పని చేసేవారో తెలుసా ?

Pic credit - Instagram

సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. 

తలైవా అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. హీరో కాకముందు కండక్టర్‏గా పనిచేశారు. శివాజీ నగర్‌-సామ్‌రాజ్‌పేట రూట్‌లోని 134వ నెంబరు బస్సులో పనిచేశారు. 

కానీ కండక్టర్‏ కాకముందు ఆయన కూలీగా.. కార్పెంటర్‏గానూ పనిచేశారన్న సంగతి చాలా మందికి తెలియదు. అపూర్వ రాగంగళ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. 

మొదట్లో ఆర్థికంగా ఎన్నో కష్టాలను అనుభవించాడు. సినిమాల్లోకి వెళ్లేందుకు నటనలో శిక్షణ తీసుకోవడానికి అతని స్నేహితుడు రాజ్ బహదూర్ సాయం చేశారు. 

2007లో ఆసియాలో అత్యధిక పారితోషికం అందుకున్న రెండో నటుడిగా రజినీకాంత్ నిలిచారు.  అంతకు ముందు తొలి స్థానంలో జాకీ చాన్ నిలిచారు. 

 ఇప్పటివరకు దాదాపు 169 సినిమాల్లో నటించారు రజినీకాంత్. ప్రస్తుతం ఆయన తన 170, 171 సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు తలైవా. 

1978 రజనీకాంత్‌కు మరపురాని సంవత్సరం. ఎందుకంటే ఆ ఏడాదిలోనే తలైవా నటించిన 20 సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. అప్పట్లోనే చాలా బిజీ తలైవా. 

రజినీకాంత్‌కి ‘సూపర్ స్టార్’ బిరుదును డిస్ట్రిబ్యూటర్ కలైపులి థాను ఇచ్చారు. రజిని నటించిన భైరవి సినిమాకు 35 అడుగుల ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేసి సూపర్ స్టార్ అని రాయించారు.