హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసుకునేవాడిని: నాని
TV9 Telugu
16 August 2024
గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని
ఇప్పుడు 'సరిపోదా శనివారం' అంటూ మరో డిఫరెంట్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు త్వరలో మన ముందుకు వస్తున్నాడు.
గ్యాంగ్ లీడర్ తర్వాత మరోసారి ప్రియాంక అరుల్ మోహన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు హీరో నాని. ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు.
ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సరిపోదా శనివారం ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు నాని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అందరితో పంచుకుంటున్నాడు.
ఒకవేళ మీరు నటుడు కాకపోయి ఉంటే అన్న ప్రశ్నకు 'పోలీసు లేదా థియేటర్‌లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పని చేసేవాడిని' అని చెప్పుకొచ్చారు నాని.
అలాగే నటనలో మీకు స్ఫూర్తి ఎవరు? అన్న ప్రశ్నకు లోక నాయకుడు కమల్ హాసన్ పేరు చెప్పారు న్యాచురల్ స్టార్ నాని.
మీ ఫిట్‌నెస్ రహస్యం? అని ప్రశ్నిస్తే.. ' నేను పెద్దగా డైట్ ఫాలోకాను. అమ్మ వండిన ప్రతిదీ తింటాను'అని తన ఫిట్ నెస్ సీక్రెట్ బయట పెట్టాడీ హీరో.
ఇక్కడ క్లిక్ చేయండి..