05 November 2025
సినిమాల్లోకి రాకముందు నయనతార ఏం చేసేదో తెలుసా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు భారీగానే పారితోషికం తీసుకుంటుదట.
అయితే సినిమాల్లోకి రాకముందు నయనతార ఏం చేసేదో తెలుసా.. ? ఆమె వెండితెర కంటే ముందే బుల్లితెరపైకి పలు షోలతో ఎంట్రీ ఇచ్చిందట
ఆమె మలయాళీ టీవీ షోలో ప్రజెంటర్ గా పనిచేసిందట. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె క్రిస్టియన్ ఫ్యామిలీ.
నయనతార టీవీ ప్రెజెంటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ సమయంలో తన అసలు పేరుతో షోలను హోస్ట్ చేసేదని చాలా మందికి తెలియదు.
కైరాలి టీవీలో ప్రసారమయ్యే 'చామయం' అనే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ షోను హోస్ట్ చేసింది. ఇందులో అందం, లైఫ్ స్టైల్ గురించి అనేక విషయాలు పంచుకుంది.
ఒక మ్యాగజైన్ కవర్‌పై ఆభరణాల ప్రకటన కోసం ఆమె ఇచ్చిన ఫోటో చూసిన డైరెక్టర్ సత్యన్ అంటికాడ్ ఆమెకు మనస్సినకరే సినిమా అవకాశం ఇచ్చారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్