31 August 2025

అప్పుడు సాఫ్ట్‏వేర్ ఉద్యోగి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు సినిమా ప్రపంచంలో చాలా మంది తారలు ఇంతకు ముందు వేరే రంగాల్లో సెటిల్ అయినవారే. నటనపై ఆసక్తితో జాబ్ వదిలేసి మరీ ఎంట్రీ ఇచ్చారు. 

అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. నటనపై ఆసక్తితో ఇన్ఫోసిస్ లో జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చింది. 

మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు చేతినిండా సినిమాలోత టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది.

తనే హీరోయిన్ అనన్య నాగళ్ల. జాబ్ మానేసి ఈ అమ్మడు.. కెరీర్ మొదట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనన్య.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. 

వకీల్ సాబ్, తంత్ర, పోట్టేల్, శాకుంతలం, డార్లింగ్, ప్లేబ్యాక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య.. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. 

అదే సమయంలో నటనపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అలా నెమ్మదిగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.