ఫ్యామిలీ స్టార్ సినిమాకు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గోంటుంది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 50 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించారని సర్కిల్లో టాక్ వినిపిస్తుంది.
అలాగే ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ దాదాపు రూ. 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. కానీ క్లారిటీ రాలేదు.
గతంలో సూపర్ హిట్ అయిన ఖుషి సినిమాకు విజయ్ దాదాపు రూ. 12 కోట్లు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ సమంత నటించింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన గీతా గోవిందం సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో విజయ్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఈ మూవీ కంటెంట్ పరంగా.. మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం విజయ్, మృణాల్ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. కెయు మోహనన్ సినిమాటోగ్రాఫర్.