17 December 2023

Pic credit - Instagram

ఇరవై ఏళ్లల్లో తిరుగులేని హీరోయిన్ త్రిష.. ఆస్తులు ఎంతంటే.. 

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ త్రిష. రెండు దశాబ్దాలుగా వెండితెరపై అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. 

 ఇటీవలే లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఇటు తెలుగు, తమిళంలో త్రిషకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు అజిత్ సరసన నటిస్తుంది. 

ఈ సినిమాతోపాటు.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. 

నివేదికల ప్రకారం త్రిష ఇప్పటివరకు దాదాపు రూ.85 కోట్లు సంపాదించిదట. విజయ్ దళపతి జోడిగా నటించిన లియో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుందట. 

ఇక తన తదుపరి సినిమాకు రూ. 4 కోట్లు తీసుకుంటుందట. ఇక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా నెలకు రూ.90 లక్షలు ఎక్కువగా సంపాదిస్తుందని సమాచారం. 

అంటే సంవత్సరానికి రూ. 10 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తుంది. ఆమెకు చెన్నైలో విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది. ఆ ఇల్లు విలువ రూ. 7 కోట్లు అని టాక్. 

అలాగే త్రిషకు నాలుగు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రూ.80 లక్షలు విలువైన Mercedes-Benz S-క్లాస్, BMW 5, రేంజ్ రోవల్ ఎవోక్ ఉన్నాయట. 

రూ. 5 కోట్లు విలువైన BMW రీగల్ కారు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ దక్షిణాది సినీ పరిశ్రమలో కథానాయికగా 21 ఏళ్లు పూర్తి చేసుకుంది హీరోయిన్ త్రిష.