300కోట్ల హిట్ కొట్టింది.. కట్ చేస్తే నాలుగు క్రేజీ ఆఫర్స్ అందుకుంది
19 August 2025
Rajeev
ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. చేసిన ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ అలా స్టార్స్ గా మారినవారే.. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా తెలుగులో వరుస అవకాశాలతో దుసుకుపోతుంది.
రీసెంట్ గానే భారీ హిట్ అందుకుంది. ఆమె నటించిన సినిమా ఏకంగా రూ. 300కోట్ల వరకు వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది
అంతే కాదు ఈ సినిమా హిట్ తో ఈ చిన్నది ఏకంగా 4 సినిమా ఆఫర్స్ అందుకుంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో తెలుసా.?
శ్రీనిధి శెట్టి.. ఈ అందాల భామ కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది.2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
KGF: ఛాప్టర్ 2లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది.
హిట్ 3 భారీ హిట్ అందుకుంది. దాంతో ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు లైనప్ చేసింది ఈ భామ.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా తన ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది.
ఇక ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా నటించిన 'సింగిల్' అనే సినిమాలో ఇవానా నటించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.