లవ్ మ్యారేజ్.. మూడేళ్లకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో పెళ్లి
08 September 2025
Rajeev
నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు.
వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు.
తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో ఆరు సినిమాలే చేసింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది.
ఆమె మరెవరో కాదు తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన అమల పాల్. ఈ ముద్దుగుమ్మ ముందుగా మైన అనే తమిళ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. సినిమాల్లో ఆకట్టుకున్న అమలాపాల్ తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఆతర్వాత 2017లో2017లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు
ఆ తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్ ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది. వీరికి ఇటీవలే ఓ బిడ్డకూడా జన్మించింది.