దేవర భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? 

Battula Prudvi

12 October 2024

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించింది సినిమా దేవర. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే 500 కోట్లకి చేరువలో ఉంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‎ దేవర పాత్రకి భార్యగా కనిపించిన శ్రుతి మరాఠీ గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం.

ఈ బ్యూటీ నేటివ్‌ ప్లేస్‌ గుజరాత్‌ రాష్ట్రం. మోడల్‌గా గ్లామర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి మరాఠీ. 2008లో ఓ మరాఠీ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు.

అదే ఏడాది ఇందిర విళా అనే తమిళ్‌ సినిమాలోనూ నటించారు. ఆ సినిమాలో హేమ మాలిని అనే స్క్రీన్‌ నేమ్‌తో చేశారు శ్రుతి.

ఆ తర్వాత కూడా తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయ్యారు ఈ బ్యూటీ.

తెలుగులో మాత్రం ఆమెకు ఇదే తొలి సినిమా. ఫస్ట్ సినిమాలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్యగా నటించడం ఆనందంగా ఉందని అంటున్నారు శ్రుతి.

రియల్‌ లైఫ్లో ఈమెకు ఆల్రెడీ పెళ్లయింది. గౌరవ్‌ ఘట్నేకర్‌ని 2016లోనే వివాహం చేసుకున్నారు శ్రుతి మరాఠీ.

దేవర పార్ట్ 2లో ఈమె నటించనుంది. చుడాలిక ఈ మూవీ పార్ట్ 2 ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో. ఇది ఎప్పుడు మొదలు కానుందో తెలియాల్సి ఉంది.