24 May 2025
సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ ఆస్తులు ఉన్న హీరోయిన్స్ వీళ్లే..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలతో ఎక్కువగా సంపాదిస్తున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార ఆస్తులు రూ.200 కోట్లు. ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు 15 నుంచి 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
హీరోయిన్ అనుష్క శెట్టి ఆస్తులు రూ.130 కోట్లు. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు తీసుకుంటుందట.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఆస్తులు రూ.120 కోట్లు అని అంచనా. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఆమె రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్.
సమంత ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అలాగే ఆమె ఆస్తులు రూ.100 కోట్లు కాగా.. ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు పారితోషికం.
సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్ బిజీగా ఉంది త్రిష. ఆమె ఆస్తులు రూ.100 కోట్లు. అలాగే ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు తీసుకుంటుందట.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆస్తులు రూ.60 కోట్లకు పైగానే ఉంటుంది. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం వసూలు చేస్తుంది.
సాయి పల్లవి ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పుడు హిందీలో తెరకెక్కుతున్న రామాయణ సినిమాకు రూ.15 కోట్లు తీసుకుంటుందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్