21 November 2025

ఎంత పని చేశావ్ అమ్మడు.. త్రిష రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..

Rajitha Chanti

Pic credit - Instagram

దాదాపు 20 సంవత్సరాలుగా భారతీయ సినిమా ప్రపంచంలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో త్రిష ఒకరు.

తరుణ్ నటించిన ద్విభాషా సినిమా ‘ఎనక్కు 20 ఉనక్కు 18’, తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెరంగేట్రం చేసింది త్రిష.

 ఆ తర్వాత ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉండిపోయింది. 

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన త్రిష.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది.

అయితే 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో త్రిష అనేక సినిమాలు రిజెక్ట్ చేసింది. కన్మణి రాంబో ఖతీజా చిత్రంలో మొదట నయన్ ప్లేస్ త్రిషను అనుకున్నారట. 

అలాగే ఆచార్య, బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, విక్రమ్ చియాన్ నటించిన సామి 2, జెనీలియా బాయ్స్ చిత్రాలను త్రిష వదులుకుందట.

ధనుష్ నటించిన ఆడుకలం, హిందీలో రామయ్య వస్తావయ్యా, తెలుగులో సమంత నటించిన జాను, తమిళంలో భైరవ, గోపాల గోపాల చిత్రాలు వదలుకుంది.

20 ఏళ్లల్లో మరిన్ని సినిమాలను వదులుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రంతోపాటు తమిళంలో మరిన్ని సినిమాలు చేస్తుంది.