18 May 2025

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. 

అయితే మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకనిర్మాత కోరుకుంటాడు. కానీ కథ నచ్చక.. డేట్స్ కుదరక కొన్ని హిట్స్ రిజెక్ట్ చేశారు మహేష్. 

ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీల కథను మహేష్ బాబుకు వినిపిస్తే కృష్ణ వద్దన్నారట. అలాగే తరుణ్ నటించిన నువ్వే కావాలి మూవీ రిజెక్ట్ చేశారు.

అలాగే రవితేజ నటించిన ఇడియట్ సినిమా, ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే, సూర్య నటించిన గజినీ సినిమాలు మహేష్ బాబు చేయాల్సింది. 

రానా దగ్గుబాటి నటించిన లీడర్, అక్కినేని నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావే సినిమాలకు మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాగా కుదరలేదట. 

ఇక రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో మహేష్ అనుకున్నారు కానీ ఆ స్థానంలో అల్లు అర్జున్ వచ్చారు. అలాగే విక్రమ్ 24 మూవీని రిజెక్ట్ చేశారు. 

అంతేకాకుండా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతోపాటు, నాని చేసిన గ్యాంగ్ లీడర్ మూవీ, త్రివిక్రమ్ చేసిన అఆ చిత్రాలకు మహేష్ బాబు అనుకున్నారట.

సుకుమార్ ముందుగా పుష్ప మూవీ కథను మహేష్ బాబుకు వినిపించగా.. ఆ పాత్ర తనకు సెట్ కాదని సున్నితంగా వదులుకున్నారట మహేష్ బాబు.