16 September 2025

40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీళ్లే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ వయసు పెరిగినా పెళ్లి మాటెత్తకుండా కెరీర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 

40 ఏళ్ల వయసు దాటినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందామా. అనుష్క నుంచి త్రిష వరకు వీళ్లే. 

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి వయసు 43 సంవత్సరాలు. ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 

హీరోయిన్ త్రిష.. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

సీనియర్ హీరోయిన్ టబు గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికీ  పెళ్లి చేసుకోకుండా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

టాలీవుడ్ హీరోయిన్ శ్రుతి హాసన్.. ప్రస్తుతం ఆమె వయసు 39 సంవత్సరాలు. అటు సినిమాల్లోనూ జోరు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట ఫుల్ యాక్టివ్. 

హీరోయిన్ ఆండ్రియా ప్రస్తుతం వయసు 39 సంవత్సరాలు. కొన్నాళ్లు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమాయణం నడిపింది. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉంటుంది.

టాలీవుడ్ సీనియర్ నగ్మా వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉండిపోయింది. అలాగే అటు సినిమాల్లోనూ నటించడం లేదు.