14 February 2024

పాపం !! ఈ హీరో బ్యాడ్‌లక్‌.. రవితేజకు గుడ్‌ లక్‌ అయింది

TV9 Telugu

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం  లో మాస్ మహారాజా రవితేజ హీరో గా వచ్చిన  ఈగల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు రవితేజ.

కమెడియన్ గా పరిచయమై సింధూరం సినిమాతో హీరోగా మారారు రవి తేజ. ఆ తర్వాత ఇడియట్ తో  నిలదొక్కుకున్నాడు మాస్ మహారాజ్.

పూరి జగన్నాథ తెరకెక్కించిన  రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ ఒకటి.

డైరెక్టర్ పూరి జగన్నాథ తెరకెక్కించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ 2003లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో రవితేజ కంటే ముందు మరో టాలీవుడ్ హీరో చేయాల్సిందట. కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఈ మూవీని వదలుకున్నారట.

ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా ?? అతడే హీరో శ్రీరామ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ లో వదులుకున్న సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.