02 May 2025

23 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు తల్లి.. ఒక్కో సినిమాకు 4 కోట్లు డిమాండ్

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. వరుస సినిమాలు.. అద్భుతమైన డ్యాన్స్, నటనతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

దక్షిణాది టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతున్న ఈ అమ్మడు కేవలం 23 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలనా చూసుకుంటుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ శ్రీలీల. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన శ్రీలీల ఇప్పుడు క్రేజీ హీరోయిన్‍గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. 

 2001 జూన్ 14న అమెరికాలో జన్మించిన శ్రీలీల బెంగళూరులో పెరిగింది. తల్లి స్వర్ణలత ఫేమస్ గైనకాలజిస్ట్. శ్రీలీల సైతం తల్లి బాటలోనే ఎంబీబీఎస్ చదివింది. 

చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకుంది. 2019లో కిస్ సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. 

పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కంద, ధమాకా, భగవంత్ కేసరి చిత్రాలతో దూసుకుపోతుంది

ప్రస్తుతం శ్రీలీల ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకుని వారి అవసరాలు చూసుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుంది ఈ బ్యూటీ. 

ఇటీవలే పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ పాటకు అదరగొట్టేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. ఒక్కో సినిమాకు 4 కోట్లు వసూలు చేస్తుంది.