15 June 2025

ఒక్కో సినిమాకు రూ.4 లక్షలు.. 24 ఏళ్ల వయసులో శ్రీలీల ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

ఈరోజు శ్రీలీల పుట్టినరోజు. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 24 సంవత్సరాలు. ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీల ఇటు సినీరంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 

తెలుగులో బాలకృష్ణ, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. ఇప్పుడు హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది ఈ అమ్మడు. 

కిస్, భరాతే సినిమాలతో అరంగేట్రం చేసిన శ్రీలీల.. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

నివేదికల ప్రకారం శ్రీలీల ఆస్తులు రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అలాగే మొదట ఒక్కో సినిమాకు ఆమె రూ.4 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. 

కానీ ఇప్పుడు ఒక్కో ప్రాజెక్టుకు రూ.1.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. పుష్ప 2లో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకుందట. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఈ అమ్మడు తెలుగుతోపాటు హిందీలో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది.

అలాగే సోషల్ మీడియాలో శ్రీలీల చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది శ్రీలీల.