ఇండస్ట్రీలో సింగర్ సునీత బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ??
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా ఎన్నో వందల పాటలు పాడి అభిమానులను సొంతం చేసుకున్నారు సింగర్ సునీత.
ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా మాత్రమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్నారు.
ఇక సునీత గత రెండు సంవత్సరాల క్రితం రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈమెకు పెళ్లి వయసుకు వచ్చినటువంటి కొడుకు కూతురు ఉన్నప్పటికీ ఈమె రెండో పెళ్లి చేసుకోవడం పట్ల ఎంతోమంది విమర్శలు చేశారు.
ఇక ఈ మధ్యకాలంలో సునీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా సునీత తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తనకు ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం గురించి తెలియజేశారు.
సుమతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అంటూ కామెంట్ చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి