శ్రియా ఆస్తులు ఎంతో తెలుసా.. ? తల్లైనా ఇప్పటికీ తగ్గని డిమాండ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించింది.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రియా.. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది. 43 ఏళ్ల వయసులోనూ బిజీగా దూసుకుపోతుంది.
1982లో జన్మించిన ఈ అమ్మడు చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో నటించింది.
కొన్నాళ్లపాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉండిపోయిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి సినిమాల్లో బిజీ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.
రష్యన్ టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త ఆండ్రీ కోస్చీవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రాధ అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటుంది శ్రియా.
శ్రియా గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నాయి. రూ. 65 లక్షల విలువైన ఆడి A6, రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్ GLE కార్లతోపాటు మరిన్ని వెహికల్స్ ఉన్నాయి.
రూ.12 లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రూ. 1.7 కోట్ల విలువైన BMW 7 సిరీస్ ఉన్నాయి. ఇటీవలే తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మిరాయ్ చిత్రంలో నటించింది.
నివేదికల ప్రకారం శ్రియా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. ఒక్కో సినిమాకు 4 కోట్లు తీసుకుంటుంది. అలాగే ఆమె ఆస్తులు రూ.80 కోట్లు ఉంటాయట