బాబోయ్.. షారుఖ్ ఖాన్ ఎన్ని ఫోన్స్ మెయింటైన్ చేస్తున్నాడో తెలుసా ?..
TV9 Telugu
Pic credit - Instagram
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. 1980లో కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.
చాలా కాలం గ్యాప్ తర్వాత గతేడాది జవాన్, పఠాన్, డంకీ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు షారుఖ్. నటనకు ఆయనకు ప్రాణం. తొలినాళ్లలో షారుఖ్‌కు వెన్నంటే ఉన్న వ్యక్తి వివేక్ వాస్వాని.
నటుడిగా సినీ ప్రయాణం చేయడం.. వసతి కల్పించడంలో షారుఖ్‌తో ఎంతో సాయం చేశాడు. కానీ ఇప్పుడు అతడు బాద్ షాను కలిసి చాలా సంవత్సరాలు అయ్యిందని చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ మాట్లాడుతూ.. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం షారుఖ్ పుట్టినరోజు వేడుకల్లో మాత్రమే అతడిని చూశానని. ఆ తర్వాత మళ్లీ కలవలేదని అన్నారు.
షారుఖ్ మొత్తం 17 ఫోన్లు వాడతాడని.. అందులో ఒక నంబర్ మాత్రమే తన దగ్గర ఉందని.. కేవలం దానికి కాల్ చేస్తే మాత్రమే షారుఖ్ తో మాట్లాడానికి వీలు ఉంటుందని అన్నారు.
షారుఖ్ నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడని.. అతడికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయని.. ఒక సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడని.. అందుకే అతడిని కలవడం చాలా కష్టమని అన్నాడు.
షారుఖ్ ఖాన్ ఫోన్ వివరాలు తెలిసి నెటిజన్స్ షాకవుతున్నారు. బాద్ షా మొత్తం 17 ఫోన్స్ వాడుతున్నారా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం బాద్ షా పఠాన్ 2లో నటిస్తున్నారు.