డబ్బులు లేక చదువు మానేసి.. ఇప్పుడు తోపు హీరోయిన్.. ఒక్కో సినిమాకు..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో మొదటి సినిమాతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందంతోపాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
కానీ ఆమె ఉన్నత చదువులకు డబ్బులు లేకపోవడంతో ఆశలు మధ్యలోనే వదిలేసింది. షాపింగ్ మాల్స్ యాడ్స్ చేస్తూ అటు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అంతేకాదు ఇటీవలే నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదండి.. టాలీవుడ్ బ్యూటీ సమంత. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తెలుగు, తమిళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సామ్.. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ దక్కించుకుంది.
కాలేజీ రోజుల్లో డబ్బులు లేకపోవడంతో ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేసింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ స్టార్ట్ చేసిన సామ్ షాపింగ్ మాల్స్ యాడ్స్ చేసింది
కాలేజీ కంప్లీట్ చేసి ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న సామ్.. ఆర్థిక సమస్యలు ఉండడంతో ఆ కోరికను వదిలేసింది. మోడలింగ్ రంగంలోకి వచ్చాక తనకు సినిమా ఆఫర్స్ వచ్చాయట.
మయోసైటిస్ సమస్యతో కొన్నాళ్లు బాధపడిన సామ్.. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే శుభం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది సామ్.