09 May 2024

సాయి పల్లవి దగ్గరున్న లగ్జరీ కార్లు ఇవే.. ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా లేడీ పవర్ స్టార్‏కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ప్యాన్స్, సెలబ్రెటీస్. 

అలాగే సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కూడా రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య తండేల్ మూవీ టీం సాయి పల్లవి స్పెషల్ వీడియో షేర్ చేసింది. 

1992 మే 9న సాయి పల్లవి కోటగిరిలో జన్మించింది. డాక్టర్ కావాలనుకుని ఎంబీబీఎస్ చదువుకుంది. అలాగే చిన్నప్పటి నుంచి డాన్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. 

టీనేజ్ వయసులోనే తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ఢీ డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది. కానీ తక్కువ సమయంలోనే ఆ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సాయి పల్లవి.  సహజ నటనతోపాటు సింప్లిసిటికీ భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక సినిమాకు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. 

ఇప్పటివరకు సాయి పల్లవి ఆస్తులు రూ.29 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ బ్యూటీ దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. 

సాయి పల్లవి గ్యారేజీలో ఆడి క్యూ3, మిత్సుబిషి లాన్సర్ ఎవో ఎక్స్, మారుతి సుజుకి నెక్సాతో సహా కొన్ని స్వాన్కీ రైడ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. 

ఈ బ్యూటీ ప్రకృతి ప్రేమికురాలు. ఇన్ స్టాలో ప్రకృతికి సంబంధించిన ఫోటోస్ పంచుకుంటుంది. కోయబత్తూర్‏లో అడవికి దగ్గరగా సొంతంగా ఇల్లు కూడా ఉంది.