06 April 2024

రామాయణం కోసం సాయిపల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..

Rajitha Chanti

Pic credit - Instagram

విరాట పర్వం సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ఇప్పుడు తండేల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ జోడిగా ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈరెండు చిత్రాలే కాకుండా హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణం ప్రాజెక్టులో నటిస్తుంది. ఇందులో సీత పాత్రలో కనిపించనుంది. 

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్  ప్రాజెక్టులో అన్ని భాషలకు చెందిన నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది.

రామాయణంలో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా.. సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యష్.. హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.

రెమ్యునరేషన్ విషయంలో సాయి పల్లవి అంత కచ్చితంగా ఉండదన్న సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్ ను బట్టి తన పారితోషికాన్ని డిసైడ్ చేస్తానని గతంలోనే చెప్పింది. 

ప్రస్తుతం సాయి  పల్లవి ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. కానీ రామాయణం మూవీకి ఎక్కువే తీసుకుంటుందట. 

తాజా సమాచారం ప్రకారం రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం దాదాపు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే దీనిపై అసలైన క్లారిటీ రాలేదు.