06 September 2025

రష్మిక అందం సీక్రెట్ ఇదే.. రోజు ఉదయమే ఆ పని చేస్తుందట..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం పాన్ ఇండియా వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. ఇప్పుడు తెలుగు, హిందీ భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. 

తాజాగా రష్మిక అందం రహస్యం రివీల్ చేసింది. ఆమె ప్రతి రోజూ ఉదయాన్నే లీటర్ నీరు తాగుతుందట. అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటుందట. 

అలాగే నాన్ వెజ్ అస్సలు తినడం మానేశానని.. కేవలం శాఖాహారిగా మాత్రమే ఉంటానని.. వ్యాయామం తర్వాత గుడ్లు తీసుకుంటుందట

ఆకు కూరలు, కూరగాయలు మాత్రమే తింటానని.. డిన్నర్ తేలికైనది తీసుకుంటానని అన్నారు. తనకు చిలగడదుంప తినడం చాలా ఇష్టమట. 

టమోటాలు, బంగాళాదుంపలు, దోసకాయ, క్యాప్సికమ్ వంటి కొన్ని కూరగాయలకు తనకు అలెర్జీ ఉందని రష్మిక వెల్లడించింది.

తనకు షూటింగ్స్ ఉండడం వల్ల సాయంత్రం వ్యాయమం చేస్తానని.. ప్రతి రోజూ తప్పకుండా 45 నిమిషాలు వ్యాయమం చేస్తానని అన్నారు.

అలాగే చర్మ సంరక్షణ విషయానికి వస్తే.. ప్రతి రోజూ ఉదయం బయటకు వెళ్లేముందు ముఖం కడుక్కోవడం.. చర్మం తేమగా ఉంచుకుంటుందట. 

ప్రతి రోజూ సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల తన చర్మం తేమగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది.