గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ఇంతకీ ఏం చదువుకున్నాడు?

29 November2024

Basha Shek

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పూర్తిస్థాయిలో  హీరోగా నటించిన చిత్రం కావడంతో గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.

చెర్రీ చదువు విషయానికి వస్తే.. చెన్నైలోనే పుట్టిన అతను ప్రైమరీ స్కూలింగ్ మొత్తం అక్కడే పూర్తి చేశాడు.

ఆ తర్వాత చెన్నైలోనే పద్మ శేషాద్రి బాల భవన్ పాఠశాల, లారెన్స్ స్కూల్స్ లో తన ఉన్నత విద్యను అభ్యసించాడు.

ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి, సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు.

ఇంటర్ తర్వాత ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్ లో చేరి నటనలో  శిక్షణ తీసుకున్నాడు.

ఆ తర్వాత యూకే వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో నటనలో పూర్తి స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చాడు.