రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. డైట్ ప్లాన్ ఇదే..
TV9 Telugu
Pic credit - Instagram
మరికొన్ని గంటల్లో తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ క్రమంలో తన ఫిట్నెస్ సీక్రెట్ సెర్చ్ చేస్తున్నారు.
రకుల్ ప్రీత్ తన ఫిట్నెస్ పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తుంది. రోజూ కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, ఫక్షనల్ ట్రైనింగ్ చేస్తుందని సమాచారం.
రోజూ 30 నిమిషాలు కార్డియో ట్రైనింగ్ తీసుకుంటుంది. అంటే రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తుందట. కేలరీలను బర్న్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి.
అలాగే శరీరాన్ని, మానసికంగా బలంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్ చేస్తుంది. ధ్యానం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి సాయపడుతుంది.
రకుల్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంది. చికెన్, చేపలు, గుడ్లు, చిరుధాన్యాలు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటుంది. ఇవి కండరాల బలానికి మంచిది.
బ్రౌన్ రైస్, క్వినోవా, చిలగడదుంప వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటుంది. శరీరంలో గ్లైకోజెన్ నిల్వలను తిరిగి నింపడంలో సహాయపడతాయి. కార్బోహైడ్రేట్లు వ్యాయామాలకు శక్తినిస్తాయి.
గింజలు, అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. ఇవి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు తోడ్పడతాయి.
రకుల్, జాకీ భగ్నానీల వివాహం రేపు (ఫిబ్రవరి 21న) గోవాలోని సముద్ర తీరాన జరగనుంది. వీరి పెళ్లి ప్రకృతి పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే అతిథులు విచ్చేశారు.