17 June 2025

డబ్బులు లేక చదువు మానేసి.. ఇప్పుడు తోపు హీరోయిన్.. ఒక్కో సినిమాకు..

Rajitha Chanti

Pic credit - Instagram

భారతీయ సినీరంగంలో స్టార్ హీరోలకు పోటీగా ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం ఆమె వయసు సైతం 42 సంవత్సరాలే. హిందీలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ ఏలేస్తుంది.

ఆమె మరెవరో కాదండి.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. భారతీయ చిత్రపరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరోయిన్. 

18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న ఈ అమ్మడు.. తండ్రి ఒప్పుకోకపోయిన తల్లి సాయంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 

2003లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో హిట్ చిత్రాలతో దాదాపు రెండు దశాబ్దాలుగ సినీరంగాన్ని ఏలేసింది ఈ బ్యూటీ.

ఇక అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత లాస్ ఏంజిల్స్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత హాలీవుడ్‏లో వరుస సినిమాల్లో నటించింది. 

కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తుంది. 

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో ప్రియాంక నటిస్తుంది. ఈ చిత్రానికి ఆమె రూ.40 కోట్ల పారితోషికం తీసుకుంటుందని టాక్.