23 December 2023

Pic credit - Instagram

ప్రభాస్ మాస్ హిట్.. ఇంతకీ 'సలార్' అంటే అర్థమేంటో తెలుసా ?..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. 

ఈ మూవీలో శ్రుతిహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషించగా.. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. 

 బాహుబలి తర్వాత ఇన్నాళ్లకు ప్రభాస్ ఖాతాలో ఆ రేంజ్ హిట్ పడింది. ప్రభాస్, నీల్ కాంబోలో రాబోతున్న విడుదలకు ముందే ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో 'సలార్' అనే పదం పై కొత్త చర్చ  మొదలైనట్లుగా తెలుస్తోంది. 

అసలు ఈ పదానికి అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. అసలు ఈ టైటిల్ అర్థం ఏంటీ ? అని తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 

సలార్ టైటిల్ అర్థాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. సలార్ అనేది ఓ ఉర్దూ పదమని.. సమర్థవంతుడైన నాయకుడని అన్నారు.

ఒక రాజుకు కుడి భుజంగా ఉంటూ.. అత్యంత నమ్మదగిన ఓ వ్యక్తిని అలాగే 'సలార్' అని పిలుస్తారంటూ నీల్ వెల్లడించారు. దీంతో సలార్ పై సస్పెన్స్ వీడింది. 

ఈ సినిమా ఇద్దరూ ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారు అనే డ్రామాగా రాబోతుంది. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు నీల్.