ముఖేష్ అంబానీతో పెళ్లికి ఆ కండీషన్ పెట్టిన నీతా అంబానీ..
10 November 2023
Pic credit - Instagram
నీతా అంబానీ దేశంలోనే అత్యధిక ధనికుడు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య. వీరికి ముగ్గురు పిల్లలు. కూతురు ఇషా, కుమారులు అనంత్, ఆకాష్.
నీతా అంబానీ మహిళా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. భారతనాట్య నృత్యకారిణి. 20 సంవత్సరాలుగా ఆమె నాట్యకారిణిగా, డాన్స్ టీచర్‌గా వర్క్ చేస్తున్నారు.
1985లో ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్నారు నీతా అంబానీ. అయితే పెళ్లికి ముందు ముఖేష్ అంబానీకి ఒక కండీషన్ పెట్టారట నీతా అంబానీ.
నీతా అంబానీ తండ్రి రవీంద్రభాయ్ అంబానీ ఒకప్పుడు బిర్లా గ్రూప్‌లో సీనియర్ మేనేజర్ హోదాలో పనిచేసేవారు. ఇప్పుడు కుమార్ మంగళం బిర్లా సంస్థకు హెడ్
6 సంవత్సరాల వయసులోనే భారతనాట్యం నృత్యకారిణిగా శిక్షణ తీసుకున్నారు. చిన్న పాఠశాలలో డాన్స్ టీచర్‌గా తన కెరీర్ ప్రారంభించింది నీతా అంబానీ.
ముకేశ్ అంబానీని పెళ్లి చేసుకోక ముందు నీతా అంబానీ ముంబైలోని ఓ స్కూల్‌లో డ్యాన్స్ టీచర్‌గా పని చేసేవారు. క్లాసికల్ డ్యాన్సర్‌గా ప్రదర్శనలు ఇచ్చారు.
ఓ కార్యక్రమంలో ఆమె ప్రదర్శన చూసిన ధీరుభాయ్ అంబానీ.. తన కుమారుడు ముఖేష్ అంబానీతో వివాహం నిర్ణయించగా.. ఒక కండీషన్ పెట్టారు నీతా అంబానీ.
పెళ్లి తర్వాత తాను ఉద్యోగం చేస్తానని చెప్పడంతో ముఖేష్ అంబానీ ఒప్పుకున్నారు. పెళ్లి తర్వాత సెయింట్ ఫ్లవర్ నర్సరీ అనే ఇన్‌స్టిట్యూట్‌లో రూ.800 జీతంకు పనిచేశారు నీతా.