ఏంటి.. అలియాను అందరూ అలా పిలుస్తారా? ఇదేం ముద్దుపేరు

TV9 Telugu

20 August 2024

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అలియా భట్.

అనతికాలంలోనే తన అందం, అభియనంతో  బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార.

ప్రస్తుతం భారత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీనటుల్లో అలియా భట్ కూడా ఒకరు.

రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిందీ బాలీవుడ్ అందాల తార.

ఇందులో రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్రలో అలియా భట్ అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమాల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి

అదేంటంటే.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ 12వ తరగతి కూడా పూర్తి చేయలేదట.

ఇక అలియా ముద్దుపేరు ఎంటో తెలుసా? పొటాటో. తనతో క్లోజ్ గా ఉన్న చాలామంది ఆమెను ఈ పేరుతోనే పిలుస్తారట