28 June 2025
65 ఏళ్ల వయసులోనూ అదే స్టైల్.. నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
కుబేర సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు కింగ్ నాగార్జున. ఇన్నాళ్లు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు సరికొత్త పాత్రలను ఎంచుకుంటున్నారు.
65 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు నాగ్. ఇప్పటికీ అదే అందం, గ్లామర్ తో ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నారు నాగ్.
వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా ఫిట్ గా బాడీ మెయింటైన్ చేసేందుకు ఆయన ఏం చేస్తుంటారు.. ? ఫిట్నెస్ సీక్రెట్ ఎంటో తెలుసుకుందామా.
నాగ్ తన రోజును వ్యాయమాలతోనే ప్రారంభిస్తారట. కార్డియో వర్కవుట్స్ మాత్రం కచ్చితంగా చేస్తారట. వారానికి ఐదు రోజులు వ్యాయమాలు చేస్తారట.
అలాగే తగినంత నిద్ర, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలట. రాత్రి ఏడు లేదా ఏడున్నర లోపే డిన్నర్ పూర్తి చేసేస్తారట. పాల ఉత్పత్తులు తీసుకోవడం మానేశారట.
నాగ్ కచ్చితంగా 12 గంటలు తిని 12 గంటలు ఉపవాసం ఉంటారట. అప్పుడప్పుడు చీట్ మీల్స్ కూడా తీసుకుంటారట. నోరు కట్టేసుకుని స్ట్రిక్ట్ గా ఉండనని అన్నారు.
ఇక ఆదివారం వచ్చిందంటే తనకు నచ్చిన ఆహారాన్ని మొహమాటం లేకుండా తినేస్తానని.. ఆ తర్వాత వర్కవుట్స్ ద్వారా అదనపు కేలరీలు కరిగించేస్తారట.
డైట్ అని ఆలోచించకుండా నచ్చింది తినేస్తానని.. ముఖ్యంగా స్వీట్స్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. వర్కవుట్స్ చేసినంత కాలం హాయిగా తినొచ్చని అన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్