మూడేళ్లలో మూడింతలు పెరిగిన మృణాల్ ఆస్తులు.. ఇప్పుడేంతో తెలుసా ?..
TV9 Telugu
Pic credit - Instagram
సీరియల్స్ ద్వారా నటిగా కెరీర్ ఆరంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరోసారి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మృణాల్ ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తుంది. ఇప్పటికీ ఈ అందాల రాశి ఎంత సంపాదించిందో తెలుసా..
మృణాల్ ఠాకూర్ నికర విలువ దాదాపు 3.9 మిలియన్లు.. అంటే రూ.33 కోట్లు. నెలకు రూ. 60 లక్షలు సంపాదిస్తుంది. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర ప్రాజెక్ట్స్ నుంచి వస్తుంది.
ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు వసూలు చేస్తుంది. అంటే సంవత్సరానికి రూ. 7 కోట్లు సంపాదిస్తుందట. 2022లో మృణాల్ ఆస్తి కేవలం రూ.28 కోట్లు. 2020లో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే.
మృణాల్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబైలోని విలవంతమైన లగ్జరీ ప్రాంతంలో నివసిస్తుంది. ఆమె వద్ద రూ. 30 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు ఉన్నట్లు సమాచారం.
అలాగే రూ. 45 లక్షలు విలువైన హోండా అకార్డ్ తోపాటు మరిన్ని లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రూ. 2.17 కోట్లు విలువైన Mercedes-Benz S-క్లాస్ లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేసింది.
మృణాల్ వద్ద రూ.2.50 లక్షల విలువైన మినీ హ్యాండ్ బ్యాగ్ ఉంది. రూ. 1.27 లక్షల విలువైన లగ్జరీ బ్రాండ్ లెదర్ స్లింగ్ బ్యాగ్, రూ. 2.2 లక్షల తెల్లటి హ్యాండ్ బ్యాగ్ ఉన్నట్లు తెలుస్తోంది.