23 August 2024
కీర్తి సురేష్ మొదటి జీతం అంత తక్కువా..? ఏ పని చేసిందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.
ఇన్నాళ్లు తెలుగు, తమిళంలో సూపర్ హిట్ సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ సినిమా చేస్తుంది. తమిళంలో హిట్టైన తేరి చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ప్రాజెక్టులో నటిస్తుంది.
అలాగే ఇటీవల రఘుతాత సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది కీర్తి సురేష్. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది.
ఈ మూవీ కమర్షియల్‌గా హిట్ కాకపోయినప్పటికీ నటనతో మెప్పించింది. ఇందులో తన పాత్రతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒక్కో సినిమాకు కీర్తి సురేష్ రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. కానీ ఆమె మొదటి జీతం ఎంతో తెలుసా.
కీర్తి తన ఫస్ట్ సాలరీ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొదటిసారిగా తాను ఓ ఫ్యాషన్ షోలో దుస్తులు సరిచేసే పని చేసినట్లు చెప్పుకొచ్చింది.
అందుకు తనకు రూ.500 జీతంగా ఇచ్చారని తెలిపింది. తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది కీర్తి సురేష్.
ఇక్కడ క్లిక్ చేయండి.