9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో.. ప్రాణం ఇచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా పరిశ్రమలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. అతడికి ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో అతడే.
ఆ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన తారక్.. తర్వాత పలు చిత్రాల్లో కనిపించారు.
స్టూడెంట్ నెం 1 సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఎన్టీఆర్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు హిట్స్ అందుకున్నారు.
మాస్ యాక్షన్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. సింగిల్ టేక్ సంభాషణలు చెప్పదగ్గ స్టార్. అలాగే అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడు సైతం ఎన్టీఆర్ కావడం విశేషం.
ఎన్టీఆర్
లో నటన మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి పలు భాషలు మాట్లాడడం. అవును.. తారక్ ఏకంగా 9 భాషలు ఆనర్గళంగా మాట్లాడతాడట.
ఎన్టీఆర్ అనర్గళంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, స్పాన్ భాషలు మాట్లాడతాడట. ఈ విషయంలో గతంలో ఓ పొలిటీషియన్ బయటపెట్టారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి భాషలో మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కొమురం భీమ్ పాత్రలో నటించారు.
ఇటీవల దేవర, వార్ 2 చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చిన తారక్.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.