జాన్వీ కపూర్ అందానికి రహస్యం ఇదే.. డైట్ ప్లాన్ ఏంటంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న జాన్వీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ జోడిగా దేవర సినిమాలో నటిస్తుంది. ఇందులో తంగం పాత్రలో కనిపించనుంది. అలాగే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులో నటించనుంది.
ప్రస్తుతం స్టన్నింగ్ ఫిట్నెస్తో ఆకట్టుకుంటున్న జాన్వీ ఒకప్పుడు అధిక బరువు సమస్యతో పోరాడింది. బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కోని ఇప్పుడు సన్నజాజీ తీగల మారింది.
జాన్వీ రోజూ యోగా, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకుంటుంది. రన్నింగ్, సైక్లింగ్, డాన్స్.. 45 నిమిషాలపాటు కార్డియో సెషన్ తో రోజును ప్రారంభిస్తున్నట్లుగా సమాచారం.
కార్డియో తర్వాత వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్, పుష్ అప్స్, ఇతర శరీర బరువు వ్యాయమాలు చేస్తుంది. ఆ తర్వాత రిలాక్సింగ్ యోగాతో వ్యాయామాలను ముగిస్తుంది.
రోజు ఉదయాన్నే స్పూన్ దేశీ నెయ్యి తీసుకుంటుంది. అలాగే బుల్లెట్ కాఫీ కూడా తీసుకుంటుంది. బ్లాక్ కాఫీలో నెయ్యి కలిపి తాగుతుంది. అల్పహాహంలో పండ్లు తీసుకుంటుంది.
ఇంట్లో వండిన భోజనాన్ని తీసుకుంటుంది. గ్లూటెన్ రహిత రోటీలు, పాలక్, మేతి వంటి వివిధ రకాల సబ్జీలను తీసుకుంటుంది. పన్నీర్, చికెన్ రూపంలో ప్రోటీన్ తీసుకుంటుంది.
జాన్వీ చాలా సింపుల్ ఫుడ్ డిన్నర్ లో తీసుకుంటుంది. వెజిటెబుల్ సలాడ్, హోమ్ మేడ్ రెడ్ రైస్ బిర్యానీ తీసుకుంటుంది. తేలికపాటి ఆహారాన్ని రాత్రి వేళలో తీసుకోవడానికి ఇష్టపడుతుంది.