TV9 Telugu
22 February 2024
వామ్మో.! ఏంటి జాన్వీ ఆర్సీ 16 కోసం అంత రెమ్యూనరేషనా.?
అందాల ఆరబోతకు, ప్రతిభకు మారుపేరైన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులో దేవర మూవీతో వస్తుంది.
దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆమె నటించడం ఆమె కెరీర్ లో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకొవచ్చు.
అంతేకాదు, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ‘ఆర్సీ 16’లో జాన్వీ కపూర్ నటించడంపై బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ ప్రాజెక్టు లో జాన్వీ పారితోషికంపై చర్చ నడుస్తుంది. ‘ఆర్సీ 16’ కోసం రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్.
బాలీవుడ్ లో ఆమె గత రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఎక్కువనే చెప్పక తప్పదు. అయితే జాన్వీ టీం ఈ వార్తను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
దేవర తర్వాత టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఇది రెండవ చిత్రం. ఇది నిస్సందేహంగా తెలుగు సినిమాలో మంచి ఛాన్స్.
మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో బుచ్చిబాబు డైరెక్షన్ లో ఆర్‌సి 16 నిర్మించబడుతుంది.
అకాడమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ చాల రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతాన్ని సమకూర్చేందుకు సిద్ధమయ్యారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి