యానిమల్ సీక్వెల్.. రణ్‌బీర్ ఎలా కనిపిస్తారో తెలుసా?
TV9 Telugu
13 March 2024
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా యానిమల్.
ఈ బాలీవుడ్ ఇండస్ట్రీ యాక్షన్ డ్రామా చిత్రనికి సీక్వెల్‌గా హిందీలో తెరకెక్కుతున్న సినిమా యానిమల్ పార్క్.
అతి త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తరుచూ మాటలు వినిపిస్తున్నాయి.
యానిమల్ పార్క్ లో హీరో కేరక్టర్ ఆద్యంతం యానిమల్ సినిమా కంటే కొత్తగా ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
ఇంతకు ముందెప్పుడూ సిల్వర్ స్క్రీన్ మీద ఆ తరహా కేరక్టర్‌ని జనాలు అస్సలు చూడలేదని అంటున్నారు మూవీ మేకర్స్.
ఫస్ట్ పార్టుతో పోలిస్తే యానిమల్ పార్క్ సినిమాలో హీరో రణ్‌బీర్ కపూర్ మరింత క్రూయల్‌గా కనిపిస్తారన్నది మాట.
మిగిలిన కేరక్టర్లు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. యానిమల్ కన్నా, యానిమల్ పార్క్ ఎక్కువ థ్రిల్ పంచుతుంది.
ఎవ్వరూ ఊహించనన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు ఈ యాక్షన్ మూవీ కెప్టెన్ సందీప్‌రెడ్డి వంగా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి