TV9 Telugu
19 February 2024
ఆ విషయంలో బాలీవుడ్ టాప్ లో నిలిచిన రణ్ వీర్ సింగ్.
బాలీవుడ్ స్టార్ హీరోలందర్లో రణ్ వీర్ సింగ్ వేరయా అంటున్నారు ఇప్పుడు ఆయన గురించి తెలిసిన అందరూ.! ఎందుకంటారా.?
యాటిట్యూడ్‌లోనూ.. స్టైలింగ్‌లోనూ అందర్నీ ఎప్పుడూ షాకయ్యేలా చేసే ఈ స్టార్.. ఇక సినిమాల గురించి స్పెషల్ గా చెప్పాలా.?
ఈ సారి తన సంపాదనతోనూ అందర్నీ ఖంగుతినేలా చేస్తున్నాడు. సినిమాల్లో కంటే యాడ్స్‌తోనే ఎక్కువ సంపాదిస్తూ..
బాలీవుడ్‌లో బజ్ చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ పోతున్న ఈ స్టార్ యాడ్స్లోనూ అదరగొడుతున్నారు.
ఇక ఒక్కో యాడ్‌కు దాదాపు 3.5 కోట్ల నుంచి 4 కోట్లు తీసుకునే ఈస్టార్ హీరో.. ఈ మధ్య రెమ్యూనిరేషన్ విషయంలో టాప్ లో ఉన్నారు.
తన రెమ్యూనరేషన్ వసూళ్లతో ఇండియాలోనే అత్యధిక యాడ్ రెవెన్యూ జనరేట్ చేసే స్టార్స్ లిస్ట్ లోకెక్కేశాడు.
దాంతో పాటే 2022 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఇచ్చే బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్ ఎన్నికయ్యారు.
ఇక ఒక్క రణ్ వీర్ మాత్రమే కాదు.. ఈయన వైఫ్ దీపిక కూడా ఓ పక్క సినిమాలు , ఇంకో పక్క యాడ్స్ తో బాలీవుడ్‌లో దూసుకుపోతోంది.
యిక్కడ క్లిక్ చెయ్యండి