16 December 2023

Pic credit - Instagram

హాయ్ నాన్న తర్వాత మృణాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. 

 సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సీతామహాలక్ష్మిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. 

ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీ నటించిన మరో సినిమా హాయ్ నాన్న. ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ అయ్యింది. 

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన  ఈసినిమా తండ్రికూతురు అనుబంధం నేపథ్యంలో రూపొంచారు డైరెక్టర్ శౌర్యువ్. 

అయితే ఈ సినిమా సక్సెస్ తర్వాత మృణాల్ రెమ్యునరేషన్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మొదటి సినిమాకు ఆమె రూ.85 లక్షలు తీసుకున్నారట. 

ఆ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇక ఇటీవలే విడుదలైన హాయ్ నాన్న సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది. 

దీంతో మృణాల్ తన రెమ్యునరేషన్ పెంచేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ.1 నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటుందట. 

 ఇక తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం హాయ్ నాన్న హిట్ తర్వాత మృణాల్ ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. 

 ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. అలాగే ఈ బ్యూటీ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.