31 May 2024

ఇన్‏స్టాలో ప్రభాస్ ఎంతమంది హీరోయిన్లను ఫాలో అవుతున్నారో తెలుసా.. ? 

Rajitha Chanti

Pic credit - Instagram

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో డార్లింగ్ ఒకరు. 

బాహుబలి సినిమాతో డార్లింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. 

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 27న గ్రాండ్‏గా రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. 

ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా కల్కి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు ప్రభాస్. అలాగే డార్లింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోండి. 

ప్రభాస్ ప్రస్తుతం ఇన్ స్టాలో మాత్రమే యాక్టివ్‏గా ఉంటున్నారు. నిత్యం తన సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‏లో ఉంటున్నారు. 

అంతేకాకుండా ప్రభాస్‏కు ఇన్ స్టాలో 12.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. డార్లింగ్ మాత్రం 18 మందిని ఫాలో అవుతున్న సంగతి తెలుసా.. 

కమల్ హాసన్, రాజమౌళి, డైరెక్టర్ మారుతి, పృథ్వీరాజ్, కృష్ణంరాజు, సందీప్ రెడ్డి వంగా, డైరెక్టర్ రాధ, అమితాబ్, ఓంరౌత్‍లను ఫాలో అవుతున్నారు. 

అలాగే ఎంతమంది హీరోయిన్లను ఫాలో అవుతున్నారంటే.. దీపికా పదుకొణె, కృతి సనన్, నటి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్‏లను ఫాలో అవుతున్నారు.