తారక్‌ 100 రోజుల కౌంట్‌డౌన్‌!

TV9 Telugu

16 March 2024

బాలీవుడ్ యాక్షన్ సినిమా వార్‌2 కోసం తారక్‌ ఎన్ని కాల్షీట్లు కేటాయించారో తెలుసా? అక్షరాలా 100 రోజులు.

ఈ ఏడాది టాలీవుడ్ యంగ్ టైగర్, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటించే ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

తారక్‌ ప్యాన్‌ ఇండియా పెర్ఫార్మెన్స్ చూడటానికి ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, స్పై సినిమా లవర్స్ కూడా ఇష్టంగా వెయిట్‌ చేస్తున్నారు.

వార్ 2 సినిమా కోసం పలు దేశాల్లో దాదాపు 100 రోజులు షూటింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు స్టార్ హీరో తారక్‌.

ఈయనతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్‌ కూడా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం వంద రోజుల కాల్షీట్లు కేటాయించారు.

ఈ కాల్షీట్లలోనే వారి సోలో ఎపిసోడ్స్, కంబైన్డ్ ఎపిసోడ్స్ చిత్రీకరించడానికి ప్లాన్‌ చేసుకున్నారు డైరక్టర్‌.

వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డేకి హృతిక్‌, తారక్‌ చేయబోయే సందడి మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా చాలానే ఉన్నాయి.

డ్యాన్సులు, ఫైట్లు మాత్రమే కాదు, ఎమోషన్స్ మీద కూడా గట్టి హోప్స్ పెట్టుకున్నారు మేకర్స్. మరోసారి ఇంటర్నేషనల్‌ స్టేజ్‌ మీద ఇండియన్‌ సినిమా సత్తా చాటేలా  ప్లాన్‌.