TV9 Telugu
12 February 2024
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన దీపికా పదుకొణె.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లు హిందీలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం ఆమె ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో నటిస్తున్నందుకు దీపికా ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా కోసం సుమారు రూ. 20 కోట్లు పారితోషికం తీసుకుంటుందట దీపికా.
‘కల్కి 2898 AD’ చిత్రాన్ని ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు.
ఈ సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు. అత్యాధునిక సాంకేతికతతో భారీగా రూపొందిస్తున్నారు.
భారతీయ పౌరాణిక ఇతిహాసాల స్పూర్తితో ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి