06 March 2024
జాన్వీ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా.. అసలు స్టోరీ ఇదన్నమాట..
Rajitha Chanti
Pic credit - Instagram
అతిలోక సుందరి శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
మార్చి 6న జాన్వీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని విషయాలు వైరలవుతున్నాయి. ముఖ్యంగా జాన్వీ పేరు గురించి.
జాన్వీ పేరంటే చాలా మందికి ఇష్టమట. ఈ పేరు పెట్టడానికి ఓ క్యూట్ స్టోరీ ఉందట. 1997లో శ్రీదేవి, అనిల్ కపూర్ కలిసి జుదాయి అనే సినిమాలో నటించారు.
ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో మరో హీరోయిన్ ఊర్మిళ మతోండ్కర్ కీలకపాత్రలో నటించారు. ఆమె పోషించిన పాత్ర పేరు జాన్వీ.
ఈ పేరు అంటే బోనీకు, శ్రీదేవికి చాలా ఇష్టమట. తమ మొదటి బిడ్డకు ఈ పేరు పెట్టాలని ఆ సినిమా సమయంలోనే నిర్ణయించుకున్నారట. అలా జాన్వీ పేరు పెట్టారట.
అలాగే తన పెళ్లి కచ్చితంగా తిరుపతిలోనే సంప్రదాయబద్ధంగా జరుగుతుందని.. కాంచీవరం జరీ చీరను కట్టుకుంటానని.. దక్షిణాది వంటకాలతోనే దవాత్ ఇస్తుందట.
తన పెళ్లిలో ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం ఇలాంటివన్నీ ఉండేలా చూసుకుంటానని చెప్పుకోచ్చింది. అలాగే తాను డాక్టర్ కావాలని తన తల్లి శ్రీదేవి కోరుకుందట.
కానీ తాను డాక్టర్ కాకుండా యాక్టర్ అయ్యానని చెప్పుకొచ్చింది. తన వద్ద ఉండే రెడ్ కలర్ వాటర్ బాటిల్ పేరు చుస్కీ అని ఆ బాటిల్ తనకు చాలా ఇష్టమని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.